మానవ అక్రమరవాణా నిరోధక యూనిట్స్ ఏర్పాటు వెనుక కథ

MHA and UNODC Project (2006)

ఏప్రిల్ 2006 లో, భారత ప్రభుత్వం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా UNODC (యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ అఫ్ డ్రగ్స్ మరియు క్రైమ్) భాగస్వామ్యంతో మన దేశంలో మానవ అక్రమ రవాణా నిరోదించేందుకు వీలుగా అమలులో ఉన్న చట్టాలు కటినంగా అమలు పరిచి ఆయా నేరానికి పాల్పడిన నేరస్థులను శిక్షలు పడేవిధంగా దర్యాప్తు చేయడానికి అలాగే విచారించడానికి వీలుగా మన దేశంలోని అధికారులకు (పోలీసులు మరియు ప్రాసిక్యూటర్లు) అవగాహన పెంచడం కోసం వారికి “శిక్షణ మరియు సామర్థ్యం పెంపొందించడం” ద్వారా వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా భారతదేశంలో చట్ట అమలు బలోపేతం చేయడం” పై ఒక పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టింది.

ఈ పైలెట్ ప్రాజెక్ట్ ను మొదటగా మన భారతదేశంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గోవా, మరియు బీహార్ అనే ఐదు (5) రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు (ఎహెచ్‌టియు) ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐదు రాష్ట్రాలు మానవ అక్రమ రవాణాకు మూలం (సోర్స్), గమ్యాన్ని (డిమాండ్ మరియు డిస్టినేషన్) గా ఉండి వాణిజ్య లైంగిక దోపిడీ, బాల కార్మికులు, వెట్టి చాకిరి కోసం మరియు ఇతర చట్ట వ్యతిరీక పనులు కోసం సహా వివిధ రకాల మానవ అక్రమ రవాణాకు మహిళలు మరియు పిల్లలను తరలించే ప్రాంతాలు గా పై ఐదు రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు కనిపించాయి. అందుకే ఈ రాష్ట్రాల్లో AHTUలను ఒక మోడల్ గా ఏర్పాటు చేసి “మానవ అక్రమరవాణా” నిరోదించాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభావవంతంగా ఉందని కనుగొనబడింది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రోటోకాల్స్ మరియు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP లు) పై పన్నెండు (12) ముఖ్యమైన వనరుల పుస్తకాలు అభివృద్ధి చేయబడ్డాయి, దాదాపు 400 శిక్షణా కార్యక్రమాలు (2010 నాటికి) నిర్వహించబడ్డాయి. వీటి ద్వారా మరియు 13,670 మందికి పైగా ప్రాసిక్యూటర్లు మరియు పోలీసు అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గోవా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్లలో ప్రభుత్వ అధికారులు మరియు స్వచ్ఛంద సంస్థలతో కూడిన తొమ్మిది (9) AHTU లు మరియు తమిళనాడు మరియు బీహార్ ప్రభుత్వాలు స్వయంగా 38 (ముప్పై ఎనిమిది) మరియు 21 (ఇరవై ఒకటి) AHTU లు ను ఏర్పాటు చేశాయి.

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 AHTU లు (ఏలూరు కేంద్రంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఒకటి, అనంతపురం (కదిరి) కేంద్రంగా రాయలసీమలో ఒకటి, రంగారెడ్డి జిల్లా కేంద్రంగా తెలంగాణా లో ఒకటి) ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడు AHTUs కు హెల్ప్ సంస్థ, ప్రజ్వల, స్త్రీ మరియు రెడ్స్ సంస్థలను ఆయా రేజనల్ నోడల్ NGOs గా నియమించడం జరిగింది.

Advisory Notification on Establishment of AHTUs (2010)

ఈ AHTUs 2007 నుంచి 2010 వరకు విజయవంతం గా నడవడం జరిగింది. ఆ తర్వాత ఈ పైలట్ ప్రాజెక్ట్ ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకొని జూన్ 2010 లో కేంద్ర ప్రభుత్వం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా “ఇంటిగ్రేటెడ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ల” స్థాపన కోసం సమగ్ర పథకం రూపొందించడం జరిగింది. ఈ పథకం ద్వారా పోలీస్ మరియు ప్రాసిక్యూషాన్ అధికారులు లలో వృతి సామర్థ్యాన్ని పెంపొందించడం, మానవ అక్రమ రవాణాకు నిరోధక చట్టాలు అమలు బలోపేతం చేయడానికి శిక్షకులకు శిక్షణతో సహా అందించాలి అనే ఆబ్జెక్ట్ తో ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతదేశంలో లోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలు కలుపుకొని దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్టాలలోని అన్ని జిల్లాల్లో AHTU లు ఏర్పాటు చేయాలి అని ఆదేశించాయి, ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన AHTU లు ప్రతి మానవ అక్రమ రవాణాకు సంబందించిన ఫిర్యాదుల నమోదు తో పాటు ఆ కేసుల అన్నిటిని సమగ్ర దర్యాప్తు బాధ్యత వహించావలిన్సి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రతి జిల్లా కేంద్రం లో AHTUలను ఏర్పాటు చేయడం, అలాగే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ మౌలిక సదుపాయాల మరియు అభివృద్ధి పథకం క్రింద కేటాయించిన నిధులతో వీటి నిర్వహణ చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కుడా ఈ AHTU ను నిర్వహించడానికి వీలుగా పోలీసు సిబ్బందిని ఇతర అధికారులును వివిధ శాఖల నుంచి కేటాయించాలని, వీరు నేరుగా ఆయా జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ కే రిపోర్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం AHTUల ఏర్పాటు, సిబ్బంది శిక్షణా కోసం మాత్రమే కేంద్రం నిధులు అందిస్తుంది. AHTU ఏర్పాటు తర్వాత వీటి నిర్వహణ పూర్తి బాధ్యత అంటే నిర్వహణ,మరియు సిబ్బందిని నియమించడం, అమలు పర్యవేక్షణ సంబంధిత భాద్యతలు స్టేట్ హోమ్ శాక (రాష్ట్ర పభుత్వం) యొక్క బాధ్యత, జాతీయ స్థాయిలో పర్యవేక్షణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వ్యవహారాలు (సెంటర్-స్టేట్ డివిజన్) అన్ని రాష్ట్రాల సమన్వయానికి బాధ్యత వహిస్తుంది.

source: AHTU Watch- SANJOG & TAFTEESH (National Study on AHTUs)